కరోనాకు ధైర్యమే మందు.. సబితా ఇంద్రారెడ్డి

by  |
కరోనాకు ధైర్యమే మందు.. సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, పరిగి : కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యమే మొదటి మెడిసిన్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పరిగి ఏరియా ఆస్పత్రిని మంత్రి బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కరోనా కాకుండా ఇతర సాధారణ వ్యాధులతో వచ్చే వారికి కూడా వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలో గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. పరిగి ఏరియా ఆస్పత్రిలో రోజుకు ఎంత మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. కేసుల పెరుగుదలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రోజూ కరోనాపై సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు అందరికీ ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. నూతన ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుతో భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో సరిపడ మందులు, అక్సిజన్ నిల్వలు ఉన్నాయన్నారు. కరోనా వస్తే ధైర్యంగా ఉంటూ ఎదుర్కోవాలన్నారు పేర్కొన్నారు. వికారాబాద్ అనంతగిరిలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో బెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికంగా కోవిడ్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు వీలుంటుందన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. ఇంట్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫీవర్ సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి కావాల్సిన మందుల కిట్ ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉంచేందుకు వీలుంటుందన్నారు. ఇలా చేయడంతో కరోనా కేసులు తగ్గేందుకు వీలుంటుందన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్ పౌసమి బసుకు సూచించారు.

Next Story

Most Viewed