చేతులకు సంకెళ్లేసుకుని లవ్ చేసుకుంటున్న ‘కపుల్’

by  |
చేతులకు సంకెళ్లేసుకుని లవ్ చేసుకుంటున్న ‘కపుల్’
X

దిశ, ఫీచర్స్ : ప్రేమను ఓ జోక్‌గా నిర్వచిస్తున్న ఈ రోజుల్లో.. తమ ప్రేమను నిలబెట్టుకునేందుకు ఓ జంట చేసిన వినూత్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది. ఎప్పటికీ విడిపోకుండా ఉండి, తామిద్దరం కాదు ఒక్కటే అని చెప్పేందుకు బేడీలేసుకొని మరీ తమ పనులు చేసుకుంటున్నారు. 3 నెలల పాటు ఇలాగే కొనసాగి, తమ ప్రేమను రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నారు. ఆ జంట గురించి మీరూ తెలుసుకోండి..

ఉక్రెనియాకు చెందిన 33 ఏళ్ల అలెగ్జాండర్ కుడ్లే, 28 ఏళ్ల విక్టోరియా పుస్తోవిటోవ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలెగ్జాండర్.. ఆటోమొబైల్ సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తుండగా, విక్టోరియా బ్యూటీషియన్. పెళ్లి చేసుకున్నాక తొలినాళ్లలో బాగానే ఉన్న ఈ జంటకు, ఆ తర్వాత కాలంలో మనస్పర్థలు ఎదురయ్యాయి. దాంతో వారంలో రెండుసార్లు ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకుంటూ, విడిపోయి కలుస్తూ జీవితంలో కొనసాగుతున్నారు. కాగా గత నెల 14న వాలంటైన్స్ డే సందర్భంగా వీళ్లు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆ డెసిషన్ తమను జీవితంలో ఎప్పటికీ కలిపి ఉంచుతుందని భావిస్తున్నారు.

3 నెలల పాటు చేతులకు బేడీలసుకోవాలని నిర్ణయించుకొని.. అలెగ్జాండర్ కుడి చేయి, విక్టోరియా ఎడమ చేయిని కలిపి చైన్‌తో లాక్ చేసుకున్నారు. ఇలా మూడు నెలలపాటు ఒకరి పనుల్లో మరొకరు సాయపడుతూ, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నిటినీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా ఫొటోలు షేర్ చేయడంతో వీరికి ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది. తాము గొడవపడుతుంటే తమలోని ప్రేమ మరింత పెరుగుతుందని ఈ జంట పేర్కొంటుండటం విశేషం. కాగా వీరి ఫొటోలను చూస్తున్న నెటిజన్లు.. మీ ప్రేమ గెలుస్తుందని, ‘ప్రెట్టీ కపుల్’ అని కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ‘హ్యాండ్‌ కఫింగ్’తో తమ పర్సనల్ వర్క్స్ (బాతింగ్, షవరింగ్) ఎలా చేసుకుంటున్నారో అని అడుగుతుండటం గమనార్హం.

Next Story

Most Viewed