‘డెల్టా’ను ఎదుర్కొనేందుకు ఫైజర్ థర్డ్ డోసు

by  |
Pfizer vaccine
X

వాషింగ్టన్: మొదట భారత్‌లో వెలుగుచూసి, ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ‘డెల్టా’ వేరియంట్‌ను ‘ఫైజర్’ టీకా థర్డ్ డోసుతో ఎదుర్కోవచ్చని కంపెనీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తమ వ్యాక్సిన్‌ థర్డ్ డోసుకు అనుమతివ్వాలని అమెరికా, యూరప్ దేశాలను కోరనున్నట్టు ఫైజర్, బయోఎన్‌టెక్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుత ట్రయల్స్‌ నుంచి సేకరించిన ప్రాథమిక వివరాల ప్రకారం ఫైజర్ మూడో డోసు తీసుకున్నవారిలో ఒరిజినల్ కరోనా స్ట్రెయిన్, బీటా వేరియంట్‌లను ఎదుర్కొనే యాంటిబాడీలు 5-10రేట్లు అధికంగా పెరిగినట్టు గుర్తించామని తెలిపాయి.

డెల్టా వేరియంట్ విషయంలోనూ ఇదే ఫలితాలు పునరావృతమవుతాయని భావిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ ప్రాణాంతక స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా మరో టీకానూ అభివృద్ధి చేస్తున్నట్టు వివరించింది. కాగా, అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ ఇప్పటివరకు వందకు పైగా దేశాల్లో వెలుగుచూసినట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed