కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు

by  |
కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు
X

దిశ, జవహర్ నగర్: అధికారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అధికార పార్టీ కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బహిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో పాలక మండలి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశాన్ని 12 మంది కౌన్సిలర్లు బహిష్కరిస్తూ, మీడియాతో మాట్లాడారు.

మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ కమిషనర్, డీఈఈ ఒంటెద్దు పోకడ‌లకు నిరసనగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించామన్నారు. తమ గోడు వెళ్లబోసుకున్నా, తమ వార్డు అభివృద్ధికి సహాయ సహకారాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్, కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలతో అభివృద్ధిని పక్కనపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డివిజన్‌లలో అభివృద్ధి కుంటుపడిందని గతంలో పలుమార్లు హెచ్చరించినా, మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని బహిరంగంగానే విమర్శించారు. మున్సిపాలిటీలో సమావేశపు హాలు ను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కార్యక్రమం ముగించుకుని వెళ్ళాక 12 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి, అనంతరం చైర్మన్, కమిషనర్ డీఈ‌లపై మంత్రి మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదే తీరు కొనసాగితే రానున్న రోజుల్లో మంత్రి మల్లారెడ్డి నిర్ణయం ప్రకారం అవిశ్వాస తీర్మానం దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed