కలకలం.. భూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో స్టాంప్స్, బాండ్ల అవినీతి

by  |
కలకలం.. భూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో స్టాంప్స్, బాండ్ల అవినీతి
X

దిశ, మణుగూరు : భూర్గంపాడు మండల కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంప్స్, బాండ్ల అవినీతి రాజ్యమేలుతోందని మండల ప్రజలు, చిన్న వ్యాపారస్తులు, మేధావులు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల అవసరాల నిమిత్తం రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్టాంప్స్, బాండ్లను పంపిణీ చేస్తున్నది. అయితే భూర్గంపాడు మండల సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారులు కొంతమంది బడా వ్యాపారస్తులకు కొమ్ముకాసి స్టాంప్స్, బాండ్ల ను అధిక రేట్లకు విక్రస్తున్నారని ప్రజలు, చిన్న వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్క 100 రూపాయల బాండ్ పేపర్ సుమారు రూ.350 నుంచి 400 వరకు విక్రస్తున్నారని ప్రజలు అంటున్నారు.

ఈ నేపథ్యంలో సబ్‌ రిజిస్ట్రార్‌ భూర్గంపాడ్ అధికారులు బడా బాబులకు పెద్దమొత్తంలో స్టాంప్స్, బాండ్లను విక్రయాలు చేసి రూ.5 వేల నుండి రూ.10 వేల వరకు కమీషన్ నొక్కుతున్నారని మండలంలో సంచలనమైన విషయాలు వినపడుతున్నాయి. అధికారుల దగ్గర నుంచి బడా వ్యాపారస్థులు కొనుగోలు చేసి, చిన్నవ్యాపారులకు అధికంగా విక్రయిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలా బాండ్లు, స్టాంప్స్ ధరలు ప్రజల మీద పడి, నేడు మార్కెట్లో బాండ్ పేపర్ కోనే పరిస్థితి లేదని పలువురు మేధావులు అనుకుంటున్నారు.

నేడు స్టాంప్స్, బాండ్లు ఎంతో విలువైనవని మనకందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఆసరాగా చేసుకొని భూర్గంపాడు అధికారులు బాండ్లు, స్టాంప్స్ మీద 5 వేలు నుంచి 10 వేల వరకు అక్రమంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి భూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి జరగకుండా చూడాలని ప్రజలు, ప్రజా సంఘాలు, పలు పార్టీల నాయకులు కోరుతున్నారు.

Next Story

Most Viewed