కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉంది: డబ్ల్యూహెచ్ఓ

by  |
కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉంది: డబ్ల్యూహెచ్ఓ
X

కరోనా వైరస్‌ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిచేల్ జే ర్యాన్ తెలిపారు. ఇప్పటికే పోలియో, స్మాల్ ఫాక్స్ వంటి అంటురోగాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవం ఉందన్నారు. ‘పెద్ద ఎత్తున వచ్చే కరోనా కేసులను పరీక్షించడానికి చాలా ల్యాబ్‌ల అవసరం ప్రస్తుతం భారత్‌కు ఉంది. ఆ దేశంలో జనభా, జనసాంద్రత రెండూ ఎక్కువే. భవిష్యత్తులో కరోనా వైరస్ మహమ్మారి కేసులు భారత్‌లోనే అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. కానీ, ఆ దేశానికి అంటు రోగాలను ఎదుర్కోగల పూర్తి సామర్థ్యం ఉంది. ఇప్పటికే పోలియో, చికెన్ ఫాక్స్ వంటి రోగాలను సమూలంగా నిర్మూలించి భారత్‌ మార్గం చూపించింది’ అని ర్యాన్ తెలిపారు.

Tags: coronavirus-outbreak-world-health-organisation-executive-director-michael-j-ryan- india-has-tremendou

Next Story

Most Viewed