కరోనా కొత్త వేరియంట్‌తో వణికిపోతున్న బ్రిటన్!

by Disha Web Desk 2 |
కరోనా కొత్త వేరియంట్‌తో వణికిపోతున్న బ్రిటన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌కు అసలు అంతం అనేది లేకపోవచ్చు. ఈ మహమ్మారి వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తోంది. కొవిడ్-19లో ఓమిక్రాన్ వరకూ మనము చూశాం. తాజాగా దీనికి మరో కొత్త సబ్ వేరియంట్ వచ్చింది. దీంతో పలు దేశాలు భయందోళనలో ఉన్నాయి. కొవిడ్ 19 వేరియంట్ ‘ఎరిస్ లేదా ఈజీ 5.1’ గా ఈ వేరియంట్ బ్రిటన్‌లో పుట్టినట్లుగా శాస్త్రవేత్తలు గర్తించారు. ఈ కొత్త వేరియంట్‌ ఇప్పుడు బ్రిటన్‌ను వణికిస్తుంది. జూలై 3న బ్రిటన్‌లో ఎరిస్ వేరియంట్‌ను మొదటి కేసుగా గుర్తించారు.

బ్రిటన్‌లో ఇది వేగంగా వ్యాపిస్తోందని, కేసుల సంఖ్య పెరుగుతోందని యూకే హెల్త్ సెక్రటరీ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఇటీవల బ్రిటన్‌లో ఈ మహమ్మారి కారణంగా గతవారం రోజుల్లోనే 8 వేల మంది ఆస్పత్రుల్లో చేరారని, వీరిలో దాదాపు 400 దాకా కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ గుర్తించామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. కరోనా పెషంట్లకు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్న సమయంలో ఇది బయట పడిందని, అక్కడ నమోదవుతున్న ప్రతి ఏడు కొవిడ్ కేసుల్లో ఒకటి ఎరిస్ వేరియంట్ అని యూకే హెల్త్ సెక్రటరీ ఏజెన్సీ తెలిపింది.

లక్షణాలు ఇవే :

తాజా అధ్యయనం ప్రకారం, కొత్త కొవిడ్ వేరియంట్ ఎరిస్ లక్షణాలపై క్లారిటీ వచ్చింది. గొంతు నొప్పి, తీవ్రమైన జలుబు, జ్వరం, తుమ్ములు, పొడి దగ్గు, తలనొప్పి, తడి దగ్గు, బొంగురు స్వరం, కండరాల నొప్పి, వాసన కోల్పోవడం లాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్ లాగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన కోల్పోవడం, జ్వరం వంటివి ఈ కొత్త వేరియంట్ ప్రధాన లక్షణాలు కావు అని నివేదికలు వెల్లడించాయి.



Next Story

Most Viewed