కరోనా వేళ… పెళ్లి ఇలా..!

by  |
కరోనా వేళ… పెళ్లి ఇలా..!
X

దిశ, మక్తల్: పెళ్లంటే బాజాభజంత్రీలు, బంధుమిత్రసపరివారంతో భారీగా ఊరేగింపుల నడుమ అంగరంగవైభవంగా వివాహం చేసుకోవాలని ప్రతివారికీ ఉంటుంది. కానీ ఇప్పటి కరోనా వేళ పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి హడావుడిలేకుండా సాదాసీదాగా జరుపుకోవాల్సిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే వారికి కష్టాలు తప్పడం లేదు. ఎలాంటి హంగుఆర్భాటం లేకుండా కొంతమందితోనే పెళ్లి సంబరాలు ముగుస్తున్నాయి. అలాంటి ఘటనే మక్తల్ పట్టణంలో జరిగింది.

మక్తల్ కు చెందిన వధూవరులు ఈ రోజు ఉదయం 10గంటలకు పెళ్లి చేసుకొని వారి ఇంటిదైవం పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే వారితో పాటు బంధవులు కేవలం ఇద్దరు మాత్రమే ఉండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిచేసుకోవడం పట్ల ఆ నూతన వధూవరుల అభిప్రాయం అడగడంతో… బంధుమిత్రులు లేకుండా ఇలా చేసుకోవడం చాలా వెలితిగా ఉందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను కరోనా నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ఇలా చేసుకోవడం తప్పనిసరి అని వారు జవాబిచ్చారు.



Next Story

Most Viewed