కోనసీమలో కరోనా కలకలం.. ఏడుగురు టీచర్లకు పాజిటివ్

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో జిల్లా వాసులు భారీగా కరోనా బారినపడ్డారు. మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో తాజాగా మరోసారి కరోనా పంజా విసిరింది. కోనసీమలోని రాజోలులో ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పాఠశాల ఆవరణలో, తరగతి గదులు, బెంచీలు పూర్తిగా శానిటైజ్ చేయించారు. ఉపాధ్యాయులు కరోనా బారినపడిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో రెండ్రోజుల పాటు స్కూలుకి సెలవులు ప్రకటించారు.

Next Story

Most Viewed