కరోనా నుంచి.. సిద్ధిపేటకు ఊరట

by  |
కరోనా నుంచి.. సిద్ధిపేటకు ఊరట
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన 458 మందిని అధికారులు గుర్తించారు. వాళ్ళందరిని 14 రోజులు హోం క్వారంటైన్‌లలో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 7న హోం క్వారంటైన్ ప్రక్రియ ప్రారంభమైంది. దశల వారీగా సాగిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. 458 మందిలో కేవలం ముగ్గురికే కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగెటివ్ వచ్చింది. మిగతా వాళ్లకూ కరోనా లక్షణాలు లేకపోవడంతో క్వారంటైన్ వ్యవధి ముగిసినా ఇంకో 14 రోజులు గృహ నిర్బంధంలోనే ఉండాలని అధికారులు సూచించారు. రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నవాళ్ళకి ఆలస్యంగా వైరస్ సోకే అవకాశం ఉంటుందని, అంతర్గతంగా ఉన్నా లక్షణాలు కనిపించవని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని మర్కజ్‌‌లో జరిగిన నిజాముద్దీన్ ప్రార్థనకు జిల్లా నుంచి ఏడుగురు వెళ్లారు. అందులో ఒకరికి పాజిటివ్ రాగా, మిగతా వారికి నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబీకులు, సన్నిహితులకు కూడా నెగెటివ్ వచ్చింది. దీంతో ఈ ఫలితాలు జిల్లా ప్రజలకి ఊరటనిచ్చాయి.

Tags: Corona virus, Positive Cases, Siddipeta, Low, delhi, markuj

Next Story

Most Viewed