ప్రతీ ఒక్కరి సాయం.. నిలిపేను ఓ ప్రాణం

by  |
ప్రతీ ఒక్కరి సాయం.. నిలిపేను ఓ ప్రాణం
X

దిశ, డోర్నకల్ : కరోనా బారిన పడిన ఓ యువకుడు ప్రాణాల దక్కించుకునేందుకు క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో 15 రోజులుగా పోరాటం చేస్తున్నాడు. రోజురోజుకూ వైరస్ అతడి శరీరంలోని ఉపిరితిత్తులపై ముప్పేట దాడి చేస్తూనే ఉంది. మందు లేని ఈ రోగం నుంచి ఇక ఆ యువకుడిని లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ మాత్రమే కాపాడగలదని వైద్యులు తేల్చారు. కరీంనగర్ జిల్లా రామగుండం పవర్ హౌస్ కాలానికి చెందిన పందిళ్ళ శ్రీనివాస్ ప్రయివేట్ బ్యాంకులో ఉద్యోగ. భార్య మౌనిక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బాసు తండాలో జూనియర్ పంచాయతీ కారదర్శిగా విధులు నిర్వహిస్తోంది. వీరిది మధ్య తరగతి కుటుంబం. 15 రోజుల క్రితం శ్రీనివాస్ కరోనా బారిన పడి పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రోజురోజుకూ శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 25వ తేదీన అతడి ఊపిరితిత్తులు 94శాతం పాడై పోయాయని, ఇక ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తేనే శ్రీనివాస్ బతుకుతాడని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. అప్పటికే ఉన్నదంతా తెచ్చి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించారు. ఇప్పుడు ట్రాన్స్ ప్లాంటేషన్ అంటే మరో 60 లక్షలు కావాలి. దీంతో భార్య, తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనపడిన పాలకులు, అధికారులను వేడుకుంటున్నారు. ఈ అపత్కాలంలో ప్రజలు సాయం చేసి తనకు పతి భిక్ష పెట్టాలని భార్య మౌనిక వేడుకుంటోంది. మౌనిక పుట్టినిల్లు మరిపెడ. గత నెల రోడ్డు ప్రమాదంలో తండ్రిని కూడా కోల్పోయింది. అందుకోసం వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తనకు ఆర్థిక సాయం అందించి ఓ ప్రాణాన్ని కాపాడాలని ఆర్తిస్తోంది. దాతలు ముందుకొచ్చి అకౌంట్ నం: 62055254393, IFSC నం: SBIN0020087 తన మామకు చెందిన బ్యాంకు ఖాతాకు పంపాలని కోరుతోంది. లేనియెడల 91216 83884 నెంబర్‌కు గూగుల్ పే చేయొచ్చని కోరారు.


Next Story

Most Viewed