శాంటా వేషంలో గిఫ్ట్స్.. 18మంది మృతి, 121 మందికి కరోనా

by  |
శాంటా వేషంలో గిఫ్ట్స్.. 18మంది మృతి, 121 మందికి కరోనా
X

దిశ,వెబ్ డెస్క్: క్రిస్మస్ పండుగ పర్వదినాన విషాదం చోటు చేసుకుంది. బెల్జియం యాంట్వెర్ప్ ప్రాంతంలోని మోల్ నగరంలో శాంటా‌ క్లాజ్ వేషంలో ఓవ్యక్తి బహుమతుల్ని అందించారు. బహుమతులు తీసుకున్న వారిలో 18 మరణించగా.., 121 మంది వృద్దులకు, 36మంది సిబ్బందికి కరోనా సోకింది.

మోల్ నగరంలోని హేమెల్‌రిజ్క్ ఓల్డేజ్ హోమ్ ఉంది. అందులో సుమారు 121మంది వృద్దులు, 36మంది సిబ్బంది ఉన్నారు. అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఓల్డేజ్ హోమ్ యజమాని, డాక్టర్ శాంటా‌క్లాజ్ వేషం ధరించారు. అనంతరం 121మంది వృద్దులకు బహుమతులు అందించారు. అనంతరం శాంటాక్లాజ్‌లో ఉన్న హోల్డేజ్ హోం యజమాని అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆయన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాధితుడికి క్రిస్మస్ కంటే ముందే కరోనా సోకినట్లు నిర్ధారించారు.

దీంతో ఆందోళనకు గురైన ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వృద్దులు, సిబ్బందికి కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్టుల్లో అందరికి కరోనా సోకింది. అందులో కొంతమందికి కరోనా తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు.., ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా తీవ్రతరం కావడంతో సుమారు 18మంది కరోనా మరణించారు. మరికొంతమంది ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది.

మరోవైపు శాంతా క్లాజ్ వేషంలో వృద్దులకు బహుమతుల్ని అందించిన డాక్టర్‌ను ‘సూపర్‌స్ప్రెడర్’ అంటూ పలువురు మండిపడుతున్నారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి బహుమతులు అందించడం వల్లే బాధితులు మరణించారని ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed