కరోనా రహిత గ్రామం.. ఎక్కడుందో తెలుసా

by  |
కరోనా రహిత గ్రామం.. ఎక్కడుందో తెలుసా
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కరోనా కేసుల గురించే ముచ్చట. పట్నం నుంచి పల్లెల దాక ఈ వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కానీ ఓ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదుకాలేదంటే విచిత్రంగా అనిపిస్తుంది కదా.. అవునూ ఆ గ్రామం అంటే కరోనాకు భయం.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడో కాదు.. ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లి.

ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే వారు ఎంత జాగ్రత్తపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో గడక, గంజి తాగి బతికినం మాకు తెలియదు ఇప్పటి రోగాలు అంటూ పెద్దవాళ్లు అంటూ ఉంటారు .. పాతకాలం మాదిరిగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ .. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ కరోనాక్ చెక్ పెట్టారు ఆ గ్రామ ప్రజలు.

చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో జనాభా సుమారు 2 వేలు కాగా.. విద్యార్థులంతా అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా సచివాలయంలోనే పరిష్కరించుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామానికి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు, పట్టణాలకు వెళ్లడం లేదు. జనసంచారం అధికంగా ఉండే పట్టణాలకు రాకపోకలు తగ్గించడంతో వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు. అంతే కాకుండా స్థానికంగా దొరికే వాటితోనే భోజనం సిద్ధం చేసుకుంటున్నారు. చెర్లోపల్లి ఇతర గ్రామస్థులు కూడా ఆదర్శంగా తీసుకుని కరోనా కట్టడి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed