కరోనా ఎఫెక్ట్.. లాంగ్ లోగోతో రిపోర్టింగ్

by  |
కరోనా ఎఫెక్ట్.. లాంగ్ లోగోతో రిపోర్టింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమాచారం అందించే రిపోర్టర్లు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. మీడియా ప్రతినిధులు బైట్‌లు, విజువల్స్ తీసుకునే సమయంలో రాజకీయ నేతల, ప్రముఖుల నోటి తుంపర్లు మైక్‌పై పడితే వైరస్ సోకే ప్రమాదం ఉందని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంతో అంతా అలర్ట్ అయ్యారు. దీంతో రోడ్లపై కవరేజ్ టైంలో లేదా ప్రెస్‌మీట్లప్పుడు లోగోలు పెద్దగా ఉండేలా ఏర్పాటు చేసుకొని కనీసం రెండు అడుగుల దూరం ఉండేలా రిపోర్టింగ్ చేస్తున్నారు.

మన దగ్గరి మీడియా ఛానళ్లు చిన్న లోగోలతో రిపోర్టింగ్ చేస్తాయి. కానీ, ఇతర దేశాల్లో లోగోలు పెద్దవిగానే ఉంటాయి. చైనీస్‌తోపాటు యూరప్ దేశాల్లో ఛానళ్లు ఇదే ప్రాసెస్‌ను ఫాలో అవుతాయి. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ప్రపంచం మొత్తం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండగా ఇన్నిరోజులపాటు ప్రెస్‌మీట్లు, కవరేజ్‌‌ల సమయంలో ముఖానికి దగ్గర పెట్టిన మీడియా లోగోల రూపాలను మార్చి రిపోర్టింగ్ చేస్తున్నారు. కేవలం కరోనా ఉన్నప్పుడే కాకుండా ఇతర సమయాల్లోనూ రిపోర్టర్లు ఇలాగే ఫాలో అయితే ఎలాంటి వైరస్ బారిన పడకపోవడమే కాకుండా బాధ్యతాయుతంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Tags: Corona Effect, Long Logo, India, Prime Minister Modi, Chinese, European Countries, Media Reporters



Next Story

Most Viewed