పరిస్థితి ఇట్లా.. బతికేది ఎట్లా…?

by  |
పరిస్థితి ఇట్లా.. బతికేది ఎట్లా…?
X

దిశ ఖమ్మం టౌన్: ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి కరోనా మరణాల పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే సుమారు 18 మంది మరణించినట్లు విశ్వసనీయ సమాచారం. అయిన వైద్యాధికారులు మాత్రం లెక్కలు చెప్పడంలో ఉదాసీనత చూపుతున్నారనే విమర్శలు మెండుగా వినపడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకి పదుల సంఖ్యలో కేసులు పెరుగుతుంటే అధికారులు మాత్రం లెక్కలు తేల్చడంలో విఫలం అవుతున్నారని విమర్శలు వినపడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులు పెరగడం తో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రైవేటు డాక్టర్లు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టమని రోగులను ఒత్తిడి చేయడంతో వారు చేసేది ఏమి లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నట్లు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

అంతే కాక ఆర్ఎంపి ద్వారా వస్తే రోగుల పట్ల మరోరకం వైద్యం చేస్తూ ఎక్కువ డబ్బులు లాగుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఉంటేనే మెరుగైన వైద్య లభిస్తుందని లేకుంటే ఆక్సిజన్ లేదంటూ ప్రైవేటు ఆసుపత్రుల్లో నుండి బయటకు పంపుతున్నారని విమర్శలు కొకోల్లలు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి వెళితే అక్కడ అరకొర వసతులు కలిపిస్తున్నారని దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు వదలాల్సి వస్తున్నదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.15వేల నుండి రూ.25లకు పైనే రోజుకు చికిత్సకోసం రోగుల వద్దనుండి దండుకుంటున్నారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్మశాన వాటికల్లో రోజు రోజుకి ఖననాల సంఖ్య పెరుగుతున్నా.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోక పోవడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుందనే చెప్పాలి.

Next Story