కరోనా ఎఫెక్ట్: కేబీఆర్ పార్కు మూసివేత

by  |
KBR Park
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్కులు, ఉద్యానవనాలు, పులుల అభయారణ్యాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా విస్తరణ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జూ పార్క్‌లు, పులుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు స్పందించి అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు, నెహ్రూ జూలాజికల్ పార్క్‌లను మూసివేశారు.

Next Story

Most Viewed