సింగరేణికి భారీ షాక్.. బాంబు పేల్చిన కాంట్రాక్టు కార్మికుల జేఏసీ!

by  |
సింగరేణికి భారీ షాక్.. బాంబు పేల్చిన కాంట్రాక్టు కార్మికుల జేఏసీ!
X

దిశ, గోదావరిఖని : కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్‌ను యాజమాన్యానికి సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శనివారం లేఖ విడుదల చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలతో పాటు లాభాల వాటాలో బోనస్‌లు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా అమలుపై ఎన్ని సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన యాజమాన్యం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

2022 జనవరి 4వ తేదీ తరువాత ఏప్పుడైనా సింగరేణి అన్ని విభాగాలలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు అందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారని.. దీనికి సంబంధించి ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీ యూ, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సింగరేణి చైర్మన్ డైరెక్టర్(పా), లేబర్ కమిషనర్‌తో పాటు అన్ని ఏరియాల జీయంలకు, మేనేజర్లకు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed