డిసెంబర్ 2,3 తేదీల్లో భవన నిర్మాణ కార్మికుల పనుల బంద్

by  |
bandh1
X

దిశ, బూర్గంపాడు: నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డు, సంరక్షణ కోసం, 1996 కేంద్ర చట్టం,1998 సెస్ చట్టం,1979 వలస కార్మికుల చట్టం పునరుద్ధరణ కోసం డిసెంబర్ 2, 3 తేదీల్లో నిర్మాణరంగ కార్మికులు పనుల బంద్ చేస్తున్నట్లు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అద్యక్షులు కె. బ్రహ్మచారి పేర్కొన్నారు. పనుల బంద్ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె జయప్రదం చేయడానికి బూర్గంపాడు మండలం సారపాకలో వివిధ ప్రాంతాల్లో మంగళవారం జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు.

రైతు పోరాటాల స్ఫూర్తితో బిల్డింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని పిలుపునిచ్చారు.1996 కేంద్ర చట్టం,1979 వలస కార్మికుల చట్టం, రక్షణ కోసం సంక్షేమ బోర్డు బలహీనపరిచే ప్రభుత్వ చర్యలకు నిరసనగా పెండింగ్ క్రైమ్ ల పరిష్కారానికి నిధుల విడుదల కోసం డిసెంబర్ 2,3 తేదీల్లో నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిన రూ.1004 కోట్లు తిరిగి బోర్డులో జమ చేయాలన్నారు. కార్మిక సంఘాల భాగస్వామ్యంతో సంక్షేమ బోర్డు సలహామండలి ఏర్పాటు చేయాలన్నారు. మండల కేంద్రాల్లో అడ్డాస్థలాలు ఏర్పాటు చేసి షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. సంక్షేమ బోర్డు, బ్యాంకుల నుండి నిర్మాణరంగ యంత్రాలు, సామాన్లు కొనుగోలుకు వడ్డీలేని రాయితీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పెంటర్లకు సబ్సిడీపై కలప అందించాలన్నారు. కార్మిక శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కరోనా లాక్ డౌన్ సమయంలో గడువు ముగిసిన కార్డులను రెన్యువల్ కు అనుతించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లానాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు బషీర్, ఓర్సు పండు, రమణయ్య, శివ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed