అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం రూ.1,100 కోట్లు

by  |
అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం రూ.1,100 కోట్లు
X

ముంబయి: అయోధ్యలో నిర్మించ తలపెటట్టిన రామ మందిరానికి సుమారు రూ. 1,100 కోట్లు ఖర్చవుతాయని, కేవలం రామాలయ కాంప్లెక్స్‌కే 300 కోట్ల నుంచి 400 కోట్లు పడుతాయని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరిజి మహారాజ్ వెల్లడించారు. ఆలయాన్ని ఎల్ అండ్ టీ నిర్మిస్తుందని, ఆలయ నిర్మాణ వ్యయం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల దాకా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం టెంపుల్ కాంప్లెక్స్‌కు రూ. 1100 కోట్ల వెచ్చించాల్సి ఉంటుందని నాగ్‌పూర్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఫండింగ్ కోసం దేశవ్యాప్తంగా డ్రైవ్ చేపడతామని, నేపాల్, భూటన్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లాంటి దేశాల నుంచీ విరాళాలు సేకరిస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం విరాళాలు ఇవ్వదలిస్తే స్వీకరిస్తామని, కానీ, తాము నిధులను అడుగబోమని తెలిపారు.

Next Story

Most Viewed