రైతుబంధుపై నిబంధనలొద్దు: జీవన్‌రెడ్డి

by  |
రైతుబంధుపై నిబంధనలొద్దు: జీవన్‌రెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రైతుబంధుపై నిబంధనలు విధించడం మంచిపద్ధతి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ రాశారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10కిలోల తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకాలకు క్వింటాలుకు రూ.2,500 మద్ధతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండ్ల తోటల రైతులకు కూడా ప్రోత్సహకాలు ఇవ్వాలని లేఖలో కోరారు.



Next Story

Most Viewed