‘కేసీఆర్ పిట్టల దొర కథలు చెప్పడం మానలేదు’

by  |
‘కేసీఆర్ పిట్టల దొర కథలు చెప్పడం మానలేదు’
X

దిశ, నిజామాబాద్: కేసీఆర్ సీఎం అనే విషయం మరిచిపోయి విలేకరుల సమావేశంలో పిట్టల దొరల కథలు చెబుతున్నారనీ, అందుకు మంగళవారం నాటి మీడియా సమావేశమే నిదర్శనమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రజలకు సందేశాన్ని ఇస్తారని ఆశించామనీ, కానీ పిట్టల దొర మాదిరిగా కహానీలు చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రభుత్వాన్ని ఎన్నడూ ఈ విధంగా విమర్శించలేదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించామని తెలిపారు. దేశంలో తానే గొప్ప అని కేసీఆర్ జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో మాత్రమే ధాన్యం కొనుగోలు జరుగుతుందని ఎక్కడా జరగడం లేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రితో మాట్లాడామనీ, రూ.11 వేల కోట్ల రుణమాఫీతో పాటు క్వింటాలు ధాన్యం రూ.2500 చొప్పున కొంటున్నట్టు అక్కడి మంత్రి చెప్పారని తెలిపారు. తమ బృందంతో కలిసి ఛత్తీస్‌గఢ్ రావాలని ఛాలెంజ్ విసిరారు.

Tags: congress leader shabbir ali, fire,cm kcr,lockdown,press meet,nizamabad



Next Story

Most Viewed