కేంద్ర బడ్జెట్‌తో ఆ 15మందికే లాభం: రాహుల్

by  |
Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ మందగిస్తే ఎంఎస్ఎంఈలను ఆదుకునే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. నిధులు మంజూరు చేస్తే పరిశ్రమలు నిలదొక్కుకునేవన్న రాహుల్.. భారత భూభాగంలోకి కిలోమీటర్ల మేర చైనా చొచ్చుకొస్తుంటే రక్షణ రంగానికి బడ్జెట్‌లో సరిగా నిధులు కేటాయించలేదన్నారు. కేంద్రం దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తోందని, ఈ బడ్జెట్‌తో 15మందికే లాభం ఉంటుందన్నారు. కేంద్రం రైతులను బెదిరిస్తూ ఢిల్లీని అష్ట దిగ్బంధంనం చేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed