మోడీ చెప్పేవన్నీ అబద్ధాలే : రాహుల్ ఫైర్

by  |
మోడీ చెప్పేవన్నీ అబద్ధాలే : రాహుల్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్రత, జీడీపీ రేటు, చైనా దూకుడు పై మోదీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైర్ అయ్యారు. మీరు చెప్పే అబద్ధాల వలన దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.

‘‘బీజేపీ వీలైనన్ని అబద్దాలు చెబుతోంది.. కోవిడ్-19 పరీక్షలు, మరణాల విషయంలో వాస్తవాలు దేశ ప్రజలకు తెలియనివ్వడం లేదని మండిపడ్డారు. కొత్త గణన పద్దతి ద్వారా జీడీపీని సరిగా అంచనా వేయలేకపోతున్నారని చెప్పారు. మీడియాను భయపెట్టడుతూ చైనా దూకుడును దేశానికి తెలియకుండా దాస్తున్నారని దుయ్యబట్టారు. మీరు సృష్టించిన భ్రమలు త్వరలోనే తొలగిపోతాయి. కానీ, మోదీ చెప్పే అబద్దాల వలన దేశం మూల్యం చెల్లించుకుంటుంది’’ అని రాహుల్ గాంధీ వివరించారు.

ఆగస్టు 10 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని రాహుల్ గతంలో జోస్యం చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ఉత్తమమైన ప్రణాళికలు రచించాలని సూచించారు. అయితే, ఆయన చెప్పినట్లు కేసులు 20లక్షల మార్క్‌ను చేరకపోయినప్పటికీ పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉంది. ఇక చైనా సేనలు లఢఖ్‌ సరిహద్దులోకి అడుగుపెట్టడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమని రాహుల్ విమర్శించారు.



Next Story

Most Viewed