కేసీఆర్​, హరీష్​, కేటీఆర్​ ఫామ్ హౌస్లకు ఉన్న కరెంట్ కనెక్షన్లు ఎన్ని?: మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్

by Dishafeatures2 |
కేసీఆర్​, హరీష్​, కేటీఆర్​ ఫామ్ హౌస్లకు ఉన్న కరెంట్ కనెక్షన్లు  ఎన్ని?: మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రులు హరీష్​ రావు, కేటీఆర్ లు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు అవసరం మేరకు కనెక్షన్లు ఇవ్వకుండా సతాయిస్తున్నది బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్, హరీష్​, కేటీఆర్​ ఫామ్ హౌస్లకు ఎన్ని కనెక్షన్లు తీసుకున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదన్నారు. రైతులకు మొండి చేయి చూపిస్తున్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మోటార్ కనెక్షన్లు ఉండగా, అందులో 20 లక్షలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. అంతేగాక క్షేత్రస్థాయిలో 12 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. 24 గంటల పేరిట ఏడాదికి రూ.6 వేల కోట్లు దోచుకుంటున్నారన్నారు. విద్యుత్ అంశంపై మంత్రి హరీష్​ రావు బహిరంగ చర్చకు రావాలన్నారు. విద్యుత్ సంస్థలు 2014 వరకు రూ.9 వేల కోట్ల నష్టంలో ఉంటే.. ఇప్పుడు రూ.50 వేల కోట్ల నష్టం దాటిందన్నారు. డిస్కమ్ ల రేటింగ్ 43 లో ఉన్నామన్నారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్​ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ ను విమర్శించే ముందు బీఆర్ఎస్ నాయకులు వాళ్ల మూలలను పరిశీలించుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసినోళ్లను విస్మరించి.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లనూ మంత్రి చేసిన ఘనత బీఆర్ఎస్ కు దక్కుతుందని విమర్శించారు. వరద బాధితులకు వెంటనే సాయం అందించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వాన్ని కోరారు.



Next Story

Most Viewed