దాడులకు, కేసులకు కాంగ్రెస్ భయపడదు : మధుయాష్కీ గౌడ్

by  |
congress leaders
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ప్రభుత్వం కేసులు పెడుతూ.. దాడులు చేస్తున్నారని వాటికి కాంగ్రెస్ భయపడదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం గాంధీ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు రక్షణ కల్పించేందుకు గాంధీ భవన్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, తద్వారా వారికి న్యాయ సలహా ఇచ్చి భరోసా కల్పిస్తామని ప్రకటించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడులు అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానని చెప్పి, విష నగరంగా మార్చేశారంటూ ఆరోపించారు. రాష్ట్ర యువతకు విద్య, ఉద్యోగాలు ఇవ్వమంటే మత్తు మందులు ఇచ్చి మత్తులో పడేస్తున్నారంటూ విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కల్వకుంట్ల కుటుంబంపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed