యాక్షన్ ప్లాన్ రెడీ.. కాంగ్రెస్ నేతలకు నోటీసులు

by  |
congress
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9, 10న కొంపల్లిలో డిజిటల్ మెంబర్‌షిప్ శిక్షణ తరగతులను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా కొందరు కాంగ్రెస్ శ్రేణులు పార్టీ క్యాడర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, బూతులు తిట్టడంతో తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాకుండా పాసుల విషయంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై శ్రేణులు సభలోనే పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనను పార్టీ అధిష్టానం సీరియస్ తీసుకుని క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జనగాం డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవ రెడ్డి, జనగాం ఏఎంసీ మాజీ చైర్మన్ యారమళ్ల సుధాకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మీదె శ్రీనివాస్‌లు ఈ నెల 29వ తేదీలోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ సంఘం ఆదేశించింది.

Next Story