అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి

by  |
అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి
X

దిశ, న్యూస్​బ్యూరో: కరోనా, లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని కార్మికుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం 35కిలోల బియ్యం, 20కిలోల పిండి, 5కిలోల పప్పు, 3లీటర్ల నూనె ప్రతి కుటుంబానికి రేషన్ లేదా ఆధార్ కార్డు ఆధారంగా అందించాలని డిమాండ్​ చేశారు. ప్రతి నెలా అసంఘటిత, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబానికి రూ. 10వేలు అందించాలని కోరారు. భూమిలేని వారికి భూమి యొక్క పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఉద్యోగి కార్డుల ద్వారా సంవత్సరంలో క్లాస్–4 ఉద్యోగులకు పే కమిషన్ ఆధారంగా రోజుకు రూ.600 చెల్లించాలన్నారు. అసంఘటిత కార్మికులందరినీ నమోదు చేసి, గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరారు. ఎన్​డబ్ల్యూఎం చైర్​పర్సన్​ లిస్సి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకుకుడు మురళీధర్ దేశ్​పాండే, నాస్వి నాయకులు రంగా శాలివాన్, ఏఐయూడబ్లూసీ వైస్ చైర్మన్ దుగ్యాల వేణు, లక్ష్మణ్​, కార్మికులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed