- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
26న భారత్ బంద్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై దేశ రాజధాని సరిహద్దుల్లో వంద రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు తమ తదుపరి కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 26న భారత్ బంద్ నిర్వహించనున్నట్టు రైతు సంఘాలు తెలిపాయి. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు నాలుగు నెలలు (ఈ నెల 26 నాటికి) పూర్తి కానున్న నేపథ్యంలో మార్చి 26న పూర్తి స్థాయి బంద్‌ను చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. దీంతో పాటు పెరిగిన పెట్రోల్ ధరలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 15న కార్మిక సంఘాలు తలపెట్టిన ఆందోళనలలో రైతులు పాల్గొననున్నారు. అంతేగాక మార్చి 29న హోళికా దహన్ పేరిట సాగు చట్టాల ప్రతులను దగ్దం చేయనున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ట్రేడ్ యూనియన్లు మార్చి 15ను ‘కార్పొరేట్ వ్యతిరేక దినం’గా ప్రకటించిన విషయం తెలిసిందే.