మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీపై గవర్నర్‌కు ఫిర్యాదు

by  |
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీపై గవర్నర్‌కు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. న్యాక్ అత్యున్నత గ్రేడ్ సాధించేందుకు తప్పుడు పత్రాలను అందించారన్న ఆరోపణలతో మల్లారెడ్డి కాలేజీని బ్లాక్ లిస్టులో ఉంచిన న్యాక్, ఐదేండ్ల నిషేధం కూడా విధించింది. ఈ నేపథ్యంలో తప్పుడు పత్రాలు సమర్పించిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి తప్పులకు బాధ్యులైన మంత్రి మల్లారెడ్డిని తక్షణమే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ సంస్థల ఫోర్జరీ లెటర్ హెడ్స్‌ను న్యాక్‌కు సమర్పించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ గవర్నర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది. మల్లారెడ్డి విద్యాసంస్థలపై సిట్, సిఐడితో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు రీసెర్చ్ స్కాలర్స్ సోమగాని కిరణ్ కుమార్, పాలడుగు శ్రీనివాస్, సిద్ధార్థ, మోహన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్‌ను కలవనున్నట్లు వారు తెలిపారు.

Next Story

Most Viewed