తీర ప్రాంతంలో సామాజిక వ్యాప్తి: కేరళ సీఎం

by  |
తీర ప్రాంతంలో సామాజిక వ్యాప్తి: కేరళ సీఎం
X

తిరువనంతపురం: తిరువనంతపురం జిల్లాకు చెందిన రెండు తీర ప్రాంతాల్లో వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరిందని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. వైరస్ దాటికి ఈ రెండు తీర ప్రాంతాలు విలవిల్లాడుతున్నట్టు తెలుస్తున్నది. 24 గంటల్లోనే 800 కొత్త కేసులు ఇక్కడ వెలుగుచూశాయి.

సీఎం విజయన్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని తిరువనంతపురం జిల్లా తీర ప్రాంతాలు పుల్లువిల, పూంతురలలో సామాజిక వ్యాప్తి జరుగుతున్నట్టు తెలిసిందని అన్నారు. ఈ జిల్లా తీరప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించబోతున్నట్టు సూత్రప్రాయంగా తెలిపారు. ఈ ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి ప్రత్యేకపద్ధతిలో కరోనాను కట్టడి చేసే యోచనలో ఉన్నట్టు వివరించారు. ఇక్కడున్న అత్యధిక పాజిటివిటీ రేటును పేర్కొంటూ కఠిన ఆంక్షలను అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ తీర ప్రాంతాల్లో ప్రజలు ఇరుకిరుకుగా జీవిస్తుంటారు. సామాజిక దూరం అసాధ్యమన్నట్టుగా వీరి జీవనశైలి ఉండటంతో కరోనా వేగంగా వ్యాపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు.

Next Story