పెరిగిన దేశీయ ఎగుమతులు.. వాణిజ్య మంత్రిత్వ శాఖ

by  |
exports33
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ ఎగుమతులు పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డిసెంబరు మొదటి మూడు వారాల్లో భారతదేశం $23.8 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. డిసెంబర్ 1, 21 మధ్య 36.2 శాతం ఎగుమతులు పెరిగాయని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. 2019-20 ఇదే కాలంతో పోలిస్తే వృద్ధి 27.7 శాతం. విలువ పరంగా చూస్తే రెండేళ్ల క్రితం18.65 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్లు మినహా 2020-21లో ఇతర వస్తువుల ఎగుమతులు 36.20 శాతం , 2019-20 ఇదే కాలంలో 27.70 శాతం పెరిగాయి. ప్రపంచ మార్కెట్‌లో రికవరీ, బలమైన డిమాండ్ కారణంగా సంవత్సరం ప్రారంభం నుండి ఎగుమతుల్లో నిరంతర పెరుగుదల ఉంది. నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి వేగం మందగించింది. నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి 43.05 శాతం నుంచి 26.49 శాతానికి పడిపోయింది. భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $400 బిలియన్ల లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story

Most Viewed