ఆర్మీలో అధికారుల సీక్రెట్ ‘సెక్స్’ లైఫ్.. ఉరేసుకున్న కల్నల్ ర్యాంక్ మహిళా ఆఫీసర్..

by  |
ఆర్మీలో అధికారుల సీక్రెట్ ‘సెక్స్’ లైఫ్.. ఉరేసుకున్న కల్నల్ ర్యాంక్ మహిళా ఆఫీసర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే ఆర్మీలో ఇద్దరు అధికారులు క్రమశిక్షణ తప్పారు. అయితే, వారిద్దరూ పెద్ద స్థాయిలో ఉన్న అధికారులని తెలుస్తోంది. ఒంటరిగా ఉంటున్న మహిళా అధికారికి పెళ్లి పేరుతో దగ్గరిన మరో అధికారి తన కామకోర్కెలు తీర్చుకున్నాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న టైంలో తీసుకున్న ఫోటోలు, వీడియాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేయడంతో భయాందోళనకు గురైన మహిళా అధికారిఆర్మీ క్యాంపు కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె నగరంలో ఆదివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నర్ ర్యాంక్ మహిళా ఆఫీసర్ ఇంతకుముందు జైపూర్‌లో విధులు నిర్వర్తించేవారు. ఇటీవల ఆమెను శిక్షణ నిమిత్తం ఇండియన్ ఆర్మీ అధికారులు పూణెకు పంపించారు. అయితే, అక్కడ బ్రిగేడియర్ స్థాయి అధికారి ఒకరు ఆమె ఒంటరితనాన్ని గుర్తించారు. ప్రేమ, పెళ్లిపేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత లోబర్చుకున్నాడు. ఆ సమయంలో శారీరక సంబంధాల వీడియోలు, చిత్రాలను తన మొబైల్‌లో సేవ్ చేసుకున్నాడు. కొంతకాలం వరకు ఇలానే ఆ మహిళా అధికారితో సీక్రెట్ రిలేషన్ కొనసాగించాడు.

సడెన్‌గా ప్లేట్ ఫిరాయించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు బ్రిగేడియర్ స్థాయి అధికారి. దీంతో భయాందోళనకు గురైన మహిళా ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుంది. అక్టోబర్ 13వ తేదీ ఉదయం మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ స్కూల్ మరియు డిపో (MINTSD)లో తన గదిలో ఉరేసుకుని లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఆఫీసర్ మహిళ కనిపించిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ఆలస్యంగా పూణె పోలీసులకు సమాచారం అందించారు.దీంతో ఈ ఘటనలో నిందితుడిగా పేరొందిన బ్రిగేడియర్ ర్యాంక్ ఆఫీసర్‌పై పూణే సిటీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

మృతురాలు, ఆర్మీ ఆఫీసర్ (కల్నల్) అయిన ఆమె భర్త ఫిర్యాదు ఆధారంగా వనోరీ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఉన్నతాధికారి బ్రిగేడియర్ అజిత్ మిల్లుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరణ) కింద అతనిపై నేరం నమోదైంది. మహిళా అధికారి ఆత్మహత్య చేసుకున్న సమయంలో నిందితుడు సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌లో విధుల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అజిత్ మిల్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విచారణను ముమ్మరం చేయగా.. ఆర్మీ అధికారులు కూడా పోలీసులకు కావాల్సిన సమాచారాన్ని, సహాయ సహకారాలను అందిస్తున్నట్టు తెలిపారు.


Next Story