అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలి : శ్వేతామహంతి

by  |
అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలి : శ్వేతామహంతి
X

దిశప్రతినిధి , హైదరాబాద్ : యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. UPSC-2020 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. శనివారం పరీక్షల నిర్వహణపై మాట్లాడిన కలెక్టర్.. అక్టోబర్ 4న జరిగే పరీక్షలకు 99ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేయగా, 46,171మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.

ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు విడతలుగా పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న ఈ అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. కొవిడ్ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. గంట ముందుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్స్ , ట్యాబ్స్ ,పెన్ డ్రైవ్, వాచీలు , క్యాలికులేటర్లు , లాగ్ టేబుల్స్ , పర్సులు, నోట్స్, చాట్స్ తదితర రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదన్నారు. హాల్ టిక్కెట్‌లో సూచించిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని చెప్పారు.ఇదిలాఉండగా యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.

Next Story