17 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలి: కలెక్టర్ శరత్

by  |
17 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలి: కలెక్టర్ శరత్
X

దిశ, నిజామాబాద్: రైతులు తెచ్చిన ధాన్యంలో 17 శాతం తేమ ఉన్నా సరే కొనుగోలు చేయాలని అధికారులను కామారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశించారు. కామారెడ్డి, దోమకొండ మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యంలో తాలు లేకుండా చూడాలన్నారు. రోడ్డు పక్కన ఉన్న రైతుల పొలాల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేయాలని సూచించారు. ముత్యంపేట, క్యాసంపల్లి గ్రామాల్లోని రైతులు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వరి కొనుగోలు పూర్తయిన తర్వాత మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డీఆర్‌డీఓ చంద్రమోహన్ రెడ్డి, డీసీఎస్‌ఓ మమత తదితరులు ఉన్నారు.

Tags: Kamareddy,collector Sharath,Inspect,crop purchase centers

Next Story

Most Viewed