‘హరితహారం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’

by  |
‘హరితహారం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’
X

దిశ, నిజామాబాద్: ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమానికి సంబంధించిన పక్కా ప్రణాళికను ప్రతి ప్రభుత్వ శాఖ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో హరిత హారంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి శాఖ జూన్ 3వ తేదీ లోపు ఒక సైట్‌ను గుర్తించి సిద్ధంగా ఉండాలని, ఈ ఏడాది జిల్లాలో 62 లక్షల మొక్కలు నాటేందుకు టార్గెట్ నిర్ణయించడం జరిగిందన్నారు. శాఖల వారీగా నాటాల్సిన మొక్కల వివరాలను ఆయా శాఖలకు తెలియచేయడం జరిగిందని, నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చూడాలన్నారు. మొక్కలు నాటాల్సిన ప్రాంతాలన్నీ గుర్తించి జూన్ 15 వ తేదీ వరకు గుంతలు తీయడం పూర్తి చేయాలని, జూన్ 18వ తేదీ వరకూ నాటాల్సిన మొక్కలను ఆయా ప్రాంతాలకు తరలించి 20వ తేదీ నుంచి నాటడం ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. నాటే ప్రతి మొక్కా బతకాలని, వాటిని కాపాడేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ ప్రాంతంలో ఏ మొక్క నాటలో ముందుగా నిర్ణయించి మొక్కలు పంపాలని, ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండరాదని అన్నారు. ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, బిఎస్ లత, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి.పాటిల్, అటవీశాఖ అధికారి సినీల్, అడిషనల్ డీసీపీ ఉషా విశ్వనాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed