అంత‌రాష్ట్ర కూలీల‌ను ఆదుకుంటాం

by  |
అంత‌రాష్ట్ర కూలీల‌ను ఆదుకుంటాం
X

దిశ‌, ఖ‌మ్మం: బ‌తుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు.. పనులు ఆగిపోయి రోజు గడవడం కష్టంగా మారిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ మనిషికి 12 కేజీల బియ్యం, రూ. 500 అందజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన మిర్చి కూలీలతో కలెక్టర్ మాట్లాడారు. వారి సౌకర్యాలు, వైద్య పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు దాదాపు 3112 మంది ఉన్నారని, వీరందరికీ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 12 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం, రూ. 500 చొప్పున నగదును అందజేయనున్నట్లు చెప్పారు. ఈ రోజు వరకు 2 వేల మంది వరకు పంపిణీ పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

Tags: collector M.V reddy, comments, Migrant laborers, bhadradi kothagudem



Next Story