కాగ్నిజెంట్‌పై వైరస్ దాడి!

by  |
కాగ్నిజెంట్‌పై వైరస్ దాడి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ‘మేజ్’ రాన్సమ్‌వేర్ దాడి వల్ల ఇబ్బందులకు గురైందని సంస్థ వెల్లడించింది. ఈ సైబర్ దాడి వల్ల కాగ్నిజెంట్ ఖాతాదారుల్లో కొందరి సేవలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. ఇండియాలోని కాగ్నిజెంట్ సంస్థలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, మేజ్ రాన్సమ్‌వేర్ దాడి గురించి అవసరమైన సమాచారాన్ని కాగ్నిజెంట్ అకౌంట్ హోల్డర్లకు ఎప్పటికపుడు అందిస్తున్నామని, సాంకేతికంగా రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. పరిస్థితిని అంచనా వేసిన తమ అంతర్గత భద్రతా బృందాలు దీన్ని గుర్తించి నిరోధించడనికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని కాగ్నిజెంట్ వివరించింది. రాన్సమ్‌వేర్ ఖాతాదారుల కంప్యూటర్ వ్యవస్థను, డేటాను ఉపయోగించకుండా అడ్డుపడుతుంది. తిరిగి వాటిని ఉపయోగించాలంటే సొమ్ము చెల్లించాలంటూ దీన్ని వాడే అక్రమార్కులు డిమాండ్ పెడతారు. ప్రస్తుతం ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా కాగ్నిజెంట్ సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

Tags: Cognizant, Maze ransomware, security, cyber, IT



Next Story

Most Viewed