పెరిగిన నిరుద్యోగిత రేటు

by  |
పెరిగిన నిరుద్యోగిత రేటు
X

దిశ, వెబ్‌డెస్క్: సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) గణాంకాల ప్రకారం..అక్టోబర్ నెలలో భారత నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 6.98 శాతానికి పెరిగిందని వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఇది 6.67 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరిగినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 8.45 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 5.86 శాతం నుంచి 6.90 శాతానికి పెరిగింది. రాష్ట్రాల వారీగా హర్యానాలో అత్యధికంగా 27.3 శాతం నిరుద్యోగిత రేటు ఉండగా, అత్యల్పంగా జమ్మూ-కశ్మీర్‌లో 16.1 శాతంగా నమోదైంది. మే నుంచి ఆగష్టు మధ్య కాలంలో మొత్తం 66 లక్షల మందికిపైగా వైట్ కాలర్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు పోయాయని సీఎంఐఈ తన నివేదికలో పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో 12 కోట్లకు పైగా ఉద్యోగాలు పోయాయని, వీరిలో ఇంజనీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు ఉన్నారని నివేదిక తెలిపింది.

Next Story

Most Viewed