ట్విట్టర్ ఇష్యూ.. కేంద్రంపై బెంగాల్ సీఎం విమర్శనాస్త్రాలు

by  |
bengal-cm-1
X

కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం అందరినీ తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని, అది సాధ్యం కాకుంటే అణచివేతకు పాల్పడుతుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ‘ట్విట్టర్‌ను కంట్రోల్ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు అణచివేసే ప్రయత్నాలు చేస్తు్న్నది. ఎవరితోనైనా ఇలాగే వ్యవహరిస్తున్నది. వాళ్లు నన్ను అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. అందుకే మా ప్రభుత్వంపైనా ఇదే ధోరణి అవలంబిస్తున్నారు’ అని అన్నారు.

బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింస లేదని, అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయని వివరించారు. వాటిని రాజకీయ హింసగా చిత్రిస్తూ బీజేపీ గగ్గోలు పెడుతున్నదని, ఇదంతా వారి జిమ్మిక్కేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింస జరుగుతున్నదన్న వాదనలు అర్థరహితమని పేర్కొన్నారు. రాష్ట్రంలో హింస జరుగుతున్నదని, లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలని కోరుతూ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ రాసిన లేఖకు సమాధానంగా దీదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.



Next Story