బెంగాల్ దంగల్.. టీఎంసీ మ్యానిఫెస్టో రిలీజ్

by  |
బెంగాల్ దంగల్.. టీఎంసీ మ్యానిఫెస్టో రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనల మేరకు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం టీఎంసీ పార్టీ మ్యానిఫెస్టోను దీదీ విడుదల చేశారు. రానున్న ఐదేళ్లలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు, నిరుద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు, భద్రత కల్పిస్తామో చెప్పే ప్రయత్నం చేశారు. టీఎంసీ మ్యానిఫెస్టోలో ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

మ్యానిఫెస్టో హైలెట్స్ :

1.సంవత్సరంలో 5లక్షలు ఉద్యోగాలు
2. స్టూడెండ్స్ కు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్స్
3. క్రిషి బంధు పథకం రూ.6 వేల నుంచి రూ.10వేలకు పెంపు
4. బంగ్లా ఆవాస్ యోజన కింద అదనంగా 25లక్షల ఇళ్ల నిర్మాణం
5.మహిష్య, తిల్, తంబుల్ సహా సామాజిక వర్గాలకు ఓబీసీ హోదా
6. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల మహిళలకు నెలకు రూ.500 ఆర్థికసాయం
7. మహిళలకు ప్రసూతి సెలవులు 731రోజులు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed