వాళ్లంతా పరీక్ష ఎందుకు రాయలేదంటే…

by  |
వాళ్లంతా పరీక్ష ఎందుకు రాయలేదంటే…
X

దిశ వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు అత్యధిక అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో జరుగుతున్న ఈ పరీక్షలకు రాష్ట్రంలో 75శాతం మంది విద్యార్థులు హాజరు కాలేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. మెయిన్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,652 మంది అభ్యర్థులకు గాను 1167 మంది మాత్రమే పరీక్షలు రాశారని తెలిపారు. కరోనా వల్లే విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందనన్నారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణపై కేంద్రం పునరాలోచించాలన్నారు.

రాష్ట్రాలు లోకల్ లాక్ డౌన్ విధించకూడదన్న హోం శాఖ ఉత్తర్వులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు లేకుండా చేయడమేంటన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం నమ్మడం లేదన్నారు. కేంద్రం మార్గదర్శకాలు చేసినంత మాత్రాన సరిపోదన్నారు. వాటిని అమలు చేసేది రాష్ట్రాలేనన్న విషయాన్ని గుర్తు చేశారు.



Next Story

Most Viewed