ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

by  |
Electric bike
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోజు రోజుకూ పెరిగిన పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించేలా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అయితే, దేశంలోని చాలా రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, తెలంగాణ ప్రభుత్వం తాజాగాపెట్రోల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపే విధంగా పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, మొదటి విడతగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ సౌకర్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను అందించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా పొల్యూషన్‌ను కొంతమేర తగ్గించవచ్చు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.



Next Story

Most Viewed