గ్రామవార్డు, సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష..

by  |
గ్రామవార్డు, సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని గ్రామ వార్డు, సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గ్రామవార్డు, సచివాలయాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కారమయ్యేలా ఈ పీఎంయూ దిశానిర్దేశం చేస్తుందన్నారు. మొదటిగా 4సర్వీసులను అమలు చేయనుండగా.. అక్టోబర్ కల్లా 543కి పైగా సేవలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అలాగే మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఇంటర్ నెట్ సదుపాయాన్ని సీఎం ప్రారంభించారు.

అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడిన గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షల ప్రక్రియను సెప్టెంబర్‌లో ముగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ కార్యక్రమాలపై శిక్షణ, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే వార్డు సచివాలయాల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్ సంబంధింత అధికారులను ఆదేశించారు. సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రారంభించే పథకాలను, వాటి మార్గదర్శకాలు ప్రజలకు చేరువయ్యేలా ఉంచాలన్నారు. కాగా, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇళ్లపట్టాలు పంపిణీని.. ఏ నెలలో వచ్చనవి అదే నెలలో పూర్తి చేసేలా ప్రణాళికను సిద్దం చేయమని అధికారులను జగన్ ఆదేశించారు.



Next Story

Most Viewed