IT పాలసీపై సీఎం జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..

by  |
cm-jagan mohanreddy
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీపై సీఎం జగన్ అమరావతి కేంద్రంగా రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతిఏడాది ఇన్సెంటివ్‌లు కల్పిస్తామన్నారు. ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాలన్నారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ వివరించారు. అందుకనుగుణంగా అవసరమైన భూములను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ఐటీ పాలసీ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

హై ఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యతనిస్తామన్నారు. భవిష్యత్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని చెప్పారు. ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖలో తీసుకురావాలని జగన్ ఆకాంక్షించారు. అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు డెస్టినేషన్‌గా యూనివర్శిటీ మారాలన్నారు. అనంతరం వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ పై సీఎం జగన్ సమీక్షించారు. ప్రతీగ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. డెసెంబర్ కల్లా 4వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Next Story

Most Viewed