షాపింగ్ ఎట్ యువర్ గేట్

by  |
షాపింగ్ ఎట్ యువర్ గేట్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రతి వ్యాపారాన్నీ తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పుడు అన్ని వ్యాపార సంస్థలు తమ నష్టాన్ని పూడ్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కొవిడ్ సంక్షోభం వల్ల ఆఫర్లు ప్రకంటించే స్థితిలో లేకపోయినా కస్టమర్లను ఆకర్షించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ప్రజల వద్దకే పాలన అనే కాన్సెప్టు ఏ మాత్రం సక్సెస్ అయ్యిందో ఏమో కానీ, చాలా సంస్థల సేవలు ప్రస్తుతం ఆ బాటలోనే ఇంటింటికీ నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. కరోనా వల్ల ఆదాయం కోల్పోవడంతో చాలా మంది ఇప్పట్లో షాపింగ్‌ల పేరుతో డబ్బు వృథా చేసే ఉద్దేశం లేకపోవడంతో అటు వైపుగా అసలు తొంగిచూడటం లేదు. ఇక కరోనా ఇప్పటికీ విజృంభిస్తుండటంతో అనసరంగా బయట తిరిగి కరోనా తెచ్చుకోవడం ఎందుకని షాపింగ్‌కుఇంట్రెస్ట్ చూపడం లేదు. దాంతో ఎలాగైనా గిరాకీ తెచ్చుకోవడానికి షాపులే ఇంటి ముందుకు కస్టమర్ల వద్దకు కదిలి వస్తున్నాయి.

ఉదయం లేవగానే.. ఇంటి ముందుకే పాల ప్యాకెట్ వచ్చేస్తుంది. దానికంటే ముందే..పేపర్ కూడా గేటు ముందు తానే ఫస్ట్ వచ్చానంటూ పాల ప్యాకెట్‌ను చూసి అరిచేస్తుంది. ఇక డోర్ డెలివరీ సేవలంటూ.. కిరాణా షాపులు బోర్డులు పెడుతున్నాయి. కరోనా కాలం మొదలు కాక ముందునుంచే ఆన్‌లైన్ స్టోర్లు ఇంటికి సరుకులు తెచ్చిస్తున్నాయి. ఇక కొవిడ్ కాలంలో మేం కూడా సరుకులు ఇంటికి తెచ్చిస్తామంటూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, డొమినోస్ ఇలా ఇవి కూడా ఆ జాబితాలో చేరాయి. తిండి విషయానికి వస్తే బయటకు వెళ్లి తినే మూడ్‌ ప్రస్తుతానికైతే ప్రజల్లో లేదు. కానీ, ఫుల్ ప్రొటెక్షన్ తీసుకుంటూ కరోనా జాగ్రత్తలతో ఫుడ్ డెలివరీ సేవలు అందుతే వాటిని ఆస్వాదిస్తున్నారు.అయితే, ఫుడ్ కోసం బయట మాత్రం అడుగుపెట్టట్లేదు.

గ్రామాల్లో చూస్తే.. గంపల్లో కూరగాయాలు ఎత్తుకుని.. వచ్చేవాళ్లను మనం చూసే ఉంటాం. ఆ తర్వాత.. తోపుడు బండ్లు వాళ్లను రిప్లేస్ చేశాయి. వాటిని కాపీ చేస్తూ పట్టణాలు, నగరాల్లో ఏకంగా వ్యాన్లు, ఆటోలు ఇంటి ముందుకు వచ్చేసి కూరగాయలు అమ్మేస్తున్నారు. వాటితోపాటు రిలయన్స్, హెరిటేజ్ వంటి స్టోర్లతో పాటు మరికొన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వెజిటేబుల్స్ ఇంటికి తెచ్చి అందిస్తున్నాయి. చేపలతో నిండిన వ్యాన్లు కూడా వీధుల్లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. ప్లాస్టిక్ సామాన్లు, కుర్చీలు, బెడ్ షీట్లు, పుస్తకాలు అబ్బో ఈ జాబితాకు అంతే లేదు. గేటు బయట అడుగుపెడితే చాలు..అన్నీ దొరుకుతున్నాయి. థియేటర్లు బంద్ కావడంతో సినిమాలు కూడా ఓటీటీ రూపంలో ఇంటి తలుపు తడుతున్నాయి. బైకులు, కార్లను కూడా అప్పడప్పడు మన వీధుల్లో క్యాంప్ వేసి అమ్మకాలు చేస్తుంటారు. ఇలా దాదాపు అన్నీ సేవలు అందుతుండగా బట్టలు, పిజ్జా షాపులు కూడా అదే బాటలోకి వచ్చాయి. వ్యానులోనే షాపింగ్ సెటప్‌తో సరికొత్త ఆలోచనతో వచ్చేస్తున్నాయి.

ముంబై వీధుల్లో ప్రముఖ క్లాతింగ్ కంపెనీ ‘పెప్పే’తమ ఉత్పత్తులతో.. వ్యానులో చిన్నపాటి స్టోర్‌నే సెట్ చేసింది. వీధి వీధి తిరుగుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నది. కస్టమర్లు తమ వద్దకు రాకపోతేనేం..మేమే వస్తామంటూ..‘మ్యాక్స్ ఫ్యాషన్స్’ కూడా ఇదే పంథాలో ముంబై వీధుల్లో తిరిగేస్తోంది. లైఫ్‌స్టైల్, పాంటలూన్స్, అలెనె సోలీ, షాపర్స్ స్టాప్‌లు వ్యానుల్లో దుకాణాలను సెట్ చేసి అమ్మాకాలు చేపడుతున్నాయి. ఇవన్నీ కూడా టాప్ బ్రాండెడ్ షోరూమ్‌లే. అన్నింటికీ ఆన్‌లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అయినా..ఇలాంటి బాటను ఎంచుకున్నాయి. ఒకప్పుడు కస్టమర్లతో కళకళలాడుతూ ఉండే.. ఈ షోరూమ్‌లన్నీ కరోనా కుదుపుతో కస్టమర్ల దగ్గరకే వచ్చేయడంవిశేషం. డొమినోస్ యాజమాన్యం కూడా ఇదే తరహాలో తమ పిజ్జాలను అమ్ముతోంది. ప్రముఖ స్వీట్ షాపు ఓనర్లు కూడా ఈ తరహా పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే డోర్ డెలివరీ సేవలతో ఆకట్టుకుంటున్న డీ-మార్ట్ ఏకంగా స్టోర్‌నే ఇంటివద్దకు తీసుకెళుతోంది. పూణేలో కూడా ఫుడ్ రిటేయిలర్స్ ఇలాంటి ఆలోచనతోనే ఇంటింటికి వచ్చారు. మరికొన్ని రోజుల్లో.. ఈ ధోరణి.. ఇతర పట్టణాలు, నగరాలకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. జాతిపిత గాంధీజీ ఎప్పుడో చెప్పారు. ‘కస్టమర్ ఈజ్ గాడ్’అని. ఆ మాటలు అక్షర సత్యాలు. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యమైన ప్రజలు ఆదరణ చూపినంత కాలమే.మ నుగడలో ఉంటుంది. లేదంటే.. షట్టర్ ఎత్తేయాల్సిందే.



Next Story

Most Viewed