సీఎం కీలక నిర్ణయం.. బార్స్, థియేటర్లు బంద్

by  |
సీఎం కీలక నిర్ణయం.. బార్స్, థియేటర్లు బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ టైమింగ్స్ (రాత్రి 8 నుండి ఉదయం 5 వరకు) పొడగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

అలాగే రాష్ట్రంలో బార్స్, సినిమా థియేటర్లు, జిమ్స్, స్పాస్, కోచింగ్ సెంటర్లను ఈ నెల 30వ తేదీ వరకు మూసివేస్తు్న్నట్టు తెలిపారు. వివాహం, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు హాజరయ్యేందకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Next Story

Most Viewed