లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనానికి ‘క్లిక్స్’

by  |
లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనానికి ‘క్లిక్స్’
X

దిశ, వెబ్‌డెస్క్: లక్ష్మీ విలాస్ బ్యాంకులో విలీనం కావాలని యోచిస్తున్న క్లిక్స్ గ్రూప్ గత కొన్ని నెలలుగా నిధుల సేకరణలో నిమగ్నమైంది. క్లిక్స్ గ్రూప్ తన హౌసింగ్ విభాగాన్ని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లిమిటెడ్‌కు మార్చడం ద్వారా మరిన్ని నిధుల సేకరణకు అవకాశముంటుందని కంపెనీ భావిస్తోంది. బ్యాంకింగ్ రహిత సంస్థగా ఉన్న క్లిక్స్ కేపిటల్ సర్వీసెస్.. డిబెంచర్స్ ద్వారా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి నిధులను సేకరిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

నిధుల సేకరణ ఇంకా కొనసాగుతోందని, అయితే ఎంత పరిమాణంలో నిధుల సేకరణ జరుగుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాదిన లక్ష్మీ విలాస్ బ్యాంకు ప్రధాన కార్యాలయం గత మూడేళ్లుగా నష్టాలను చూస్తోంది. ప్రస్తుతం బ్యాంకుకు అత్యవసర మూలధన నిధులు అవసరం. 2017-18లో రూ. 585 కోట్లుగా ఉన్న బ్యాంకు నష్టాలు 2019-20లో రూ. 836 కోట్లకు పెరిగాయి.

ఇదే కాలంలో బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 25.39 శాతానికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే క్లిక్స్ గ్రూప్ సంస్థ విలీన ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ఏడాది మొదటి భాగంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆర్‌బీఐ అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. ఇటీవల మళ్లీ విలీన చర్చలు మొదలయ్యాయి. ఐసీఐసీఐ బ్యాక్, కోటక్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ దిగ్గజాలతో విలీనం చేసేందుకు ఆర్‌బీఐ ఆలోచిస్తోందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed