ఆకట్టుకుంటున్న ‘క్లాస్ ఆఫ్ 83 ’

by  |
ఆకట్టుకుంటున్న ‘క్లాస్ ఆఫ్ 83 ’
X

దిశ, వెబ్ డెస్క్‌: బాలీవుడ్ హీరో బాబీ డియోల్ చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా ‘క్లాస్ ఆఫ్ 83’. ఇందులో బాబీ పోలీస్ అకాడమీకి డీన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 1980 నాటి నేపథ్యంలో తీస్తున్నారు. బాంబే(ప్రజెంట్ ముంబై) లో క్రైమ్ రేట్ అధికంగా ఉన్న టైమ్ అది. . వాస్తవ ఘటనల నేపథ్యంలో సయ్యద్ యూనస్ హుస్సేన్ జైదీ రచించిన ‘ది క్లాస్ ఆఫ్ 83’ అనే పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో బాబీ విజయ్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది..

‘క్లాస్ ఆఫ్ 83’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిర్మించారు. ఈ చిత్రానికి అతుల్ సభర్వాల్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 21న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్ నెట్‌ఫిక్స్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ‘‘క్లాస్ ఆఫ్ 83’’ ట్రైలర్ విడుదల చేశారు. బాంబే నగరానికి ఐదుగురు గ్యాంగ్‌స్టార్స్ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. వారిని చంపడానికి బాబీ డియోల్ ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తాడు. అందుకోసం.. బాబీ.. యంగ్ పోలీసు అధికారులను గుర్తించి.. వారిని ఎన్ కౌంటర్ స్పెషలిస్టులుగా తయారు చేస్తాడు. వారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు.

”దారి తప్పిన వ్యవస్థని ఆర్డర్ లో పెట్టడానికి కొన్నిసార్లు చట్టాన్ని కూడా అతిక్రమించాల్సి వస్తుంది” అని ట్రైలర్‌లో చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో అనూప్ సోనీ జాయ్ సేన్ గుప్తా – విశ్వజీత్ ప్రధాన్ – భూపేంద్ర – హితేష్ భోజ్ రాజ్ – సమీర్ పరాంజపే ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విజు షా సంగీతం సంగీతం సమకూర్చగా మారియో పొల్జాక్ సినిమాటోగ్రఫీ అందించారు

Next Story

Most Viewed