పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్.. వరుడు ఎవరంటే?

by Disha Web Desk 6 |
పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్.. వరుడు ఎవరంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ నేను శైలజ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత సర్కార్ వారి పాట, రంగ్ దే, భోళా శంకర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ దసరా చిత్రంలో నానికి జంటగా నటించి సూపర్‌ హిట్‌‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే గత కొద్ది కాలంగా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో అలాంటి వార్తలపై ఈ అమ్మడు తండ్రి స్పందించి క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ కీర్తి పెళ్లి వార్తలు ఆగడం లేదు.

తాజాగా, మళ్లీ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతుందన్న పుకార్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో 13 ఏళ్ల నుంచి ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు కూడా తెలపడంతో ఆ వ్యక్తిని తొందరలో కీర్తి పెళ్లి చేసుకోబోతుందట. ఇందులో నిజమెంత ఏదో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ మాత్రం అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నారు. ప్రేమలో ఉంటే.. అధికారికంగా ప్రకటిస్తుంది కదా.. అనవసరంగా కొందరు లేనిపోని పుకార్లు క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కేసి అక్కడే వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తుంది.



Next Story

Most Viewed