RJ Anmol :అమీర్ ఖాన్ సపోర్ట్‌తోనే మా పెళ్లి జరిగింది.. అన్మోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 9 |
RJ Anmol :అమీర్ ఖాన్ సపోర్ట్‌తోనే మా పెళ్లి జరిగింది.. అన్మోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నటి అమృతరావును పెళ్లి చేసుకునేందుకు ఆమె తండ్రి కాంచన్ రావు మెప్పుకోసం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఆర్‌జే అన్మోల్. 2016లో మ్యారేజ్ చేసుకున్న ఈ జంట అన్యోన్యంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా రీసెంట్‌గా ఓ సమావేశంలో తమ బంధం గురించి మాట్లాడిన అన్మోల్.. ‘ఒకసారి ఓ సినిమా షూట్ జరుగుతున్నపుడు అక్కడకు వచ్చిన అమీర్ నా పనిని ప్రశంసించాడు. దీంతో థాంక్స్ చెప్పిన నేను.. ధైర్యం కూడగట్టుకుని ‘అమృత తండ్రి ముందు ఇలాగే పొగిడేయండి’ అని అమీర్‌ను అడిగాను. దీనికి నవ్వుతూ రిప్లై ఇచ్చిన ఆయన.. ‘నీ పద్ధతి చూస్తే ముచ్చటేస్తుంది’ అంటూ వెంటనే అంగీకరించాడు’ అని అన్మోల్ వెల్లడించారు. చివరగా తన లవ్ ఎఫైర్ సీక్రెట్ అయినందున గర్ల్‌ఫ్రెండ్ ఎవరో అమీర్‌కు చెప్పలేదని తెలిపాడు.

Click here for Instagram Link

Also Read: Anni Manchi Sakunamule OTT Release: :‘అన్నీ మంచి శకునములే’. ఎప్పుడంటే!

Next Story

Most Viewed